Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ సినిమా నుంచి తప్పుకున్న పూజ హెగ్డే!

 Bhavadeeyudu Bhagath Singh Update
  • వరుస ఫ్లాపులతో ఉన్న పూజ హెగ్డే 
  • త్వరలో మహేశ్ బాబుతో సెట్స్ పైకి
  • 'జన గణ మన' ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ 
  • బాలీవుడ్ లోను బిజీ అవుతున్న పూజ
పూజ హెగ్డేకు ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. అయినా ఆమె గ్రాఫ్ పడిపోయే అవకాశం లేదు. ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా పెద్దవే. పవన్ కల్యాణ్ తో హరీశ్ శంకర్ చేయనున్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలోను ఆమెనే హీరోయిన్ అనే హింట్ కూడా ఇచ్చాడు.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు చేయనని పూజ హెగ్డే చెప్పినట్టుగా తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' చేస్తున్నారు. ఆ తరువాత తమిళ సినిమా 'వినోదయా సితం' రీమేకులో చేయనున్నారు. అందువలన ఆయన 'భవదీయుడు భగత్ సింగ్' సెట్స్ పైకి రావడానికి చాలా సమయం పడుతుంది. 

 ఒక వైపున త్రివిక్రమ్ - మహేశ్ సినిమాలో పూజ హెగ్డే చేయనుంది. మరో వైపున విజయ్ దేవరకొండ సరసన 'జన గణ మన' చేయనుంది. అంతేకాదు, హిందీ నుంచి కూడా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. అందువల్లనే తాను పవన్ ప్రాజెక్టును చేయలేనని హరీశ్  శంకర్ తో పూజ చెప్పినట్టుగా సమాచారం.
Pavan kalyan
Pooja Hegde
Bhavadeeyudu Bhagath Singh

More Telugu News